WGL: వరంగల్ రంగశాయిపేట క్రిస్టియన్ కాలనీకి చెందిన గజ్జెల సాగర్ (31) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరి లత ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ సీఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


