హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ యాప్ వేధింపులు.. రూ.5.73 లక్షలు నష్టం

BHPL: కాటారానికి చెందిన ఓ యువకుడు లోన్ యాప్ వేధింపులకు గురై రూ.5.73 లక్షలకు పైగా నష్టపోయాడు. మొదట రూ. 25 వేలు రుణం తీసుకోగా, నిర్వాహకులు అధిక వడ్డీలు విధిస్తూ ఫోన్ హ్యాక్ చేసి, వ్యక్తిగత వివరాలతో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించాడు. వేధింపులు భరించలేక భారీ మొత్తాన్ని చెల్లించిన యువకుడు సోమవారం సైబర్ క్రైమ్ , స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.