హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఈవో

SRD: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈవో రోహిణి ఆదేశించారు. చదువులో వెనుకబడిన వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకొని బోధించాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా ఇప్పటినుంచే కృషి చేయాలని ఆమె సూచించారు.