హైదరాబాద్: 28°C
తెలంగాణ

లష్కర్ ఉద్యోగం పేరుతో రూ.50 వేల మోసం

WGL: రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన శ్రీనివాసుకు నీటిపారుదల శాఖలో లష్కర్ ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం మాజీ సర్పంచ్ రూ.50 వేలు తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సిఫార్సు లేఖ చూపిస్తూ తప్పించుకుంటున్నారని, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.