ADB: ఇచ్చోడ మండలం ఆడేగాం-K గ్రామ రైతుల వద్ద మొక్కజొన్నలు కొనుగోలు చేసి, రూ.7.70 లక్షల బకాయిలు చెల్లించకుండా 5 నెలలుగా కాలయాపన చేస్తున్న ముజాహిద్‌ను అరెస్టు చేసినట్లు CI ప్రవీణ్ కుమార్ సోమవారం తెలిపారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రైతులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్: CI ప్రవీణ్ కుమార్


