హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలి: MLA

SRD: ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ పథకాలను అందించాలని MLA చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.