హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాహస శిబిరంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం: వీసీ

KNR: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 18 నుంచి 27 వరకు జరగనున్న జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్ అడ్వెంచర్ క్యాంపునకు శాతవాహన విశ్వవిద్యాలయ బృందం డా. కాంపెల్లి అర్జున్ ఆధ్వర్యంలో బయలుదేరింది. ఈ సందర్భంగా వీసీ యు. ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.