ఉమ్మడి మెదక్‌లోని పలు పట్టణాల్లో రేషన్ డీలర్లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కార్డుదారులకు కిలోకు రూ.10 చెల్లించి, ఆ బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలోని ఇథనాల్ పరిశ్రమలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాలకు జీపీఎస్ ఉన్నప్పటికీ కొందరు అధికారుల సహకారంతో ఈ దందా సాగుతుండటంపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.
తెలంగాణ
రేషన్ సన్నబియ్యం అక్రమ రవాణా


