హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఏనుమాముల మార్కెట్ పున: ప్రారంభం

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేటి నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా ప్రారంభం కానున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక తెలిపారు. ఈ మేరకు మార్కెట్ వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని ఆమె వెల్లడించారు. రైతులు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావద్దని, దళారులను ఆశ్రయించకుండా తమ పంట ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు తీసుకువచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని ఆమె కోరారు.