హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ పార్క్, చనాఖా-కోరాట, విమానాశ్రయం, ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.