హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి ప్రాజెక్టులు సరే.. ఆదాయం పెంపు ఏదీ?

WGL: GWMC ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్లు చర్చ జరుగుతోంది. నగరానికి భారీ అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరవుతున్నా, సొంత ఆదాయం పెంపులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. రూ.5,257 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్ 2.0లో రూ.610 కోట్లతో 24 గంటల తాగునీటి పథకాలు చేపడుతున్నారు. అయితే పన్నుల వసూళ్లు, ఆదాయ మార్గాల బలోపేతం బల్దియాకు సవాలుగా మారాయి.