హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై లైంగిక దాడి యత్నం.. 20 ఏళ్ల జైలు శిక్ష

HYD: కోకాపేటలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో అస్సాంకు చెందిన సెక్యూరిటీ గార్డు రనోజ్ తాయేకు రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2024 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి రూ.2 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.