MNCL: భీమిని మండలం రాంపూర్ వద్ద బొలెరో వాహనం బైకును ఢీకొన్న ఘటనలో తాండూర్‌కు చెందిన పెడ్డేటి అంజి ప్రసాద్ తలకు గాయం కాగా, కుడి కాలు విరిగి శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
బైక్‌ను ఢీ కొన్న బొలెరో వాహనం.. వ్యక్తికి తీవ్రగాయాలు


