BDK: ఖమ్మం కోర్టులో పెండింగ్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ కేసులను కొత్తగూడెంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ కేసుల విచారణ కొత్తగూడెంలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరగనుంది. దీంతో కక్షిదారులకు ప్రయాణ భారం తగ్గనుంది. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
తెలంగాణ
ఎస్సీ, ఎస్టీ కేసులు కొత్తగూడెం కోర్టుకు బదిలీ


