PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ 8వ వార్డులో వెల్మ దాసరి భూమమ్మ సీసీ రోడ్డుపై అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని కాలనీవాసులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, ఇతర పెద్దలు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అధికారులు జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించి, దారి పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
అక్రమ గోడ నిర్మాణంపై ఎంపీడీవోకు ఫిర్యాదు


