హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు న్యాయం చేయాలంటూ రాస్తారోకో

SRPT: గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు రెండు కాళ్లు విరిగాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు గరిడేపల్లి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.