హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ ఫిర్యాదు పరిష్కార వేదిక

NRML: లోకేశ్వరం విద్యుత్ ఉపకేంద్రంలో మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించి పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈఈ తిలక్, బాసర ఏడీఈ శ్రీకాంత్‌లు తెలిపారు. లోకేశ్వరం, తానూర్, బాసర, ముథోల్ మండలాలకు చెందిన వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.