WNP: సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య సాగర్ డిమాండ్ చేశారు. మర్రికుంటలో సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ నిర్మాణ కార్మికులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం బీసీ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సగరులను బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్


