MLG: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో సోమవారం కోతి 11కేవీ నియంత్రికపై దూకడంతో పోస్ట్ ఇన్సులేటర్ ధ్వంసమైంది. దీంతో ఫ్యూజులు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులకు కోతులగుంపు ఆటంకం కలిగించడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు ఫ్యూజులు కొట్టేయడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
కోతుల బీభత్సం..పోస్ట్ ఇన్సులేటర్ ధ్వంసం


