హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ఐ

NRPT: మరికల్ మండలం తీలేరు గ్రామంలో ప్రజల సహకారంతో రూ.1.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 అధునాతన వైర్‌లెస్ సీసీ కెమెరాలను ఎస్ఐ రామ్ లాల్ ప్రారంభించారు. గ్రామ భద్రత, నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో సురక్షితంగా మారాలని ఆయన పేర్కొన్నారు.