హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కొనిజర్లలో ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KMM: కొనిజర్ల మండల కేంద్రంలోని ఇవాళ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో వృద్ధులు, వితంతులకు పింఛన్ మంజూరి పత్రాలు పంపిణీ చేస్తారని వారు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు.