NRPT: దామరగిద్ద మండలంలో 2026 వర్షాకాలానికి బోర్లలో నీరు లేక ఎండిన వరి పంటను రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్ తెలిపారు. 33% పంట నష్టపోయిన రైతులకు మాత్రమే పరిహారం అందుతుందని, కోసిన పంటకు వర్తించదని పేర్కొన్నారు. పట్టా పాస్బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా పత్రాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఎండిన వరి పంటను రైతులు నమోదు చేసుకోండి: ఎంఏవో


