NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అక్రమాలకు పాల్పడుతున్నారని ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. తీర్మానాలు లేకుండానే ఉపాధి హామీ మేట్లను తొలగించి, సీసీ రోడ్డు, డ్రైనేజీ, బోరుబావి పనులు చేపట్టారని ఆరోపిస్తూ బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
కొత్తపల్లి సర్పంచ్, కార్యదర్శిపై మంత్రికి ఫిర్యాదు


