GDWL: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను పల్లకిపై తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. అనంతరం రథాన్ని ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించి ప్రత్యేక హారతి సమర్పించారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రమిదలు, గాజులు, కుంకుమ ఉచితంగా పంపిణీ చేశారు.
తెలంగాణ
వైభవంగా బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం


