హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: టీజీబీ

GDWL: ఖాతాదారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మధుమోహన్‌రెడ్డి సూచించారు. మల్దకల్ మండలం ఎల్కూరులో బ్యాంకు ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ పథకాలు, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీ-కేవైసీ చేయించుకోవాలని, ఓటీపీ, ఏటీఎం పిన్ వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లించాలని తెలిపారు.