హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలదేవుని గుట్ట ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడలో పెళ్లి ఇంటి పందిరి కొమ్మ కార్యక్రమానికి బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బోయపల్లికి చెందిన మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రుద్రారం వాసి మాల రామస్వామిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.