MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి ఘట్టమైన స్వామివారి పాదుకలు (ఉద్దాలు) కురుమూర్తి గిరులకు చేరుకోవడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. గాలిగోపురం వద్ద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ మధ్య మెట్ల మార్గంలో పాదుకలను ఉద్దాల మండపానికి తరలించారు.
తెలంగాణ
కురుమూర్తి గిరులకు చేరిన స్వామివారి పాదుకలు


