SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమన్న దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 6వ రోజు వేడుకలను ఆలయ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించారు. మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, వాయనం, స్వామివారి చిత్రపటం అందజేశారు.
తెలంగాణ
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకదీపం దీపోత్సవం


