హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్!

NZB: జిల్లాలోని 80 క్వార్టర్స్ ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసును ఐదో టౌన్ పోలీసులు సోమవారం ఛేదించారు. నాగారం చౌరస్తా వద్ద నిందితులు శ్రీకాంత్, ఫైసల్ ఖాన్‌లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు బంగారు చైన్లు, వెండి బ్రాస్లెట్, బంగారు ముక్కుపుడకను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.