KNR: కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్ 41వ డివిజన్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, DY. మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ రేణుక శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి


