JGL: పెగడపల్లి మండలం బతికపల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి అన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి


