హైదరాబాద్: 28°C
వార్తలు

యమునా నది కాలుష్యంపై సుప్రీం సీరియస్

యమునా నది శుద్ధికి వేల కోట్లు వెచ్చిస్తున్నా కాలుష్యం తగ్గకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నదీ తీర ప్రాంతాల్లో పౌర పాలన పూర్తిగా విఫలమైందని ధర్మాసనం మండిపడింది. ఈ నిర్లక్ష్యం వల్లే నది పరిస్థితి మరింత దిగజారుతోందని స్పష్టం చేసింది. ఇకపై ఏ రాష్ట్రంలో నీటి నాణ్యత తగ్గినా ఆ ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తామంది. సంబంధిత అధికారులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.