హైదరాబాద్: 28°C
వార్తలు

రాజీవ్-సోనియాల గొడవపై రాహుల్ వ్యాఖ్యలు

తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణ వేడుకలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజీవ్, సోనియా గాంధీలు జీవితంలో ఒక్కసారే గొడవ పడటం చూశానన్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ, అమరీందర్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలిపారు. సభకు హాజరైన అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు.