హైదరాబాద్: 28°C
వార్తలు

వేల్పూర్ వీడీసీలోకి తిరిగి నాయీబ్రాహ్మణ సంఘం

NZB: వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీలో ఐక్యతకు మరో ముందడుగు పడింది. కొంతకాలంగా కమిటీకి దూరంగా ఉన్న నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు తిరిగి చేరడంతో కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న కులాల సంఖ్య 18 నుంచి 19కి చేరింది. సంఘం తరఫున జనార్దన్‌ను వీడీసీ సభ్యుడిగా నియమించారు. అన్ని వర్గాలు సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.