హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్

అభివృద్ధి చెందుతున్న దేశాల ముందు ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే వేర్వేరు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయనే తప్పుడు భావన ఉందని బ్రిటన్ రాజకుమారుడు విలియమ్ పేర్కొన్నారు. అయితే, ఈ రెండిటిని కలిపి అభివృద్ధి పథాన నడవొచ్చని భారత్ ప్రపంచానికి నిరూపించిందని కొనియాడారు. రంగులమయమైన, సంక్లిష్టమైన, పలు ప్రత్యామ్నాయాలతో కూడిన ఓ కొత్త చిత్రాన్ని భారత్ చూపించిందని చెప్పారు.