హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ఇద్దరి హత్యల జ్ఞాపకాలు బాధాకరం: సోనియా

తన జీవితంలో రెండు అత్యంత విషాదకర ఘట్టాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వెల్లడించారు. తన అత్తగారైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యా ఘటనలు తనకు భయానక జ్ఞాపకాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జ్ఞాపకాలను పుస్తకంలో రాయడం తనను ఎంతో బాధించాయని పేర్కొన్నారు. ఆ దుర్భర కాలాల్లో తన పిల్లలైన రాహుల్, ప్రియాంక ఎంతో అండగా నిలిచారని చెప్పారు.