హైదరాబాద్: 28°C
వార్తలు

తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. దీంతో వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. డిసెంబర్ 27న మండల పూజను, 2027 జనవరి 14న మకరవిళక్కు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జనవరి 19 వరకు భక్తులకు స్వామి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మరుసటి రోజు జనవరి 20న ఆలయాన్ని ప్రత్యేక పూజల తర్వాత మూసివేస్తారు.