హైదరాబాద్: 28°C
తెలంగాణ

నోటీసు లేకుండా దుకాణం కూల్చివేత

MNCL: లక్సెట్టిపేట బీట్ బజార్ 14వ వార్డుకు చెందిన పలకుర్తి అశోక్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణ సమయంలో ఆరు నెలల క్రితం ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన దుకాణాన్ని కూల్చారని, సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు. శిథిలాలను తొలగించి పరిహారం చెల్లించాలని కోరారు.