JN: పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో SI సృజన్ కుమార్ వారిని విచారిస్తూ గంజాయి సరఫరా, వినియోగంపై వివరాలు సేకరిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
యువకులకు గంజాయి పాజిటివ్


