KNR: గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గుడిసెలు లేని తెలంగాణ నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత బస్సు, విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలతో కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
గుడిసెలు లేని తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే


