హైదరాబాద్: 28°C
తెలంగాణ

10:55 అయినా విధులకు రాని సిబ్బంది?

SRPT: జిల్లా మైనింగ్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10:55 గంటలైనా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జిల్లా మైనింగ్ అధికారి ప్రజావాణికి వెళ్లినట్లు సమాచారం. మిగతా సిబ్బంది కూడా విధులకు హాజరుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది సమయపాలన పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.