WNP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీత రెడ్డి 11 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భార్యాభర్తల సమస్యలకు సంబంధించి 2, భూతగాదాలకు 2, పరస్పర గొడవలకు సంబంధించి 7 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ


