హైదరాబాద్: 28°C
తెలంగాణ

హంగర్గా వాసికి నేషనల్ అవార్డు

KMR: హంగర్గా గ్రామానికి చెందిన డా. ఆనందరావు వాఘ్మారేకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు-2026 అందుకున్నారు. అనాథ పిల్లలకు విద్య, వసతి కల్పించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.