హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైప్‌లైన్ లీకేజీతో గ్రామంలో దుర్వాసన

WNP: దొడగుంటపల్లి గ్రామంలో పైప్‌లైన్ లీకేజీతో ప్రతిరోజూ నీరు వృథాగా పోతూ రోడ్డు పక్కన మురుగునీరు నిలుస్తోంది. తీవ్ర దుర్వాసన వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని అరికట్టి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.