హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులపై జాప్యం వద్దు: ఎస్పీ

MDK: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూవివాదాలు, కుటుంబ, ఆర్థిక సమస్యలను పరిశీలించిన ఆయన.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించాలన్నారు. పారదర్శకతతో విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు బాధితులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.