హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగరాల వాగు వద్ద మొసలి కలకలం

WNP: శ్రీరంగాపూర్ మండలం నాగరాల వాగు సమీపంలోని పురాతన శివాలయం వద్ద మొసలి కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాగు పరిసరాలకు వెళ్లే రైతులు, చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరూ నీటిలోకి దిగవద్దని హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.