హైదరాబాద్: 28°C
తెలంగాణ

జయంతికి ఆహ్వానించలేదని ఆగ్రహం

MHBD: బిర్సా ముండా 151వ జయంతి వేడుకలకు ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడంపై కొత్తగూడ మండల తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ అధికారుల తీరును తప్పుబట్టారు. ఘటనపై గిరిజన శాఖ మంత్రి, కమిషనర్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.