BHNG: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని AIKMS రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి ఆరోపించారు. సోమవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం?


