KMR: గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ స్వాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు సంగెం రాజు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
డిగ్రీ కాలేజీ కోసం ప్రజావాణిలో వినతి


