హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోల్‌కతా ఈ-సిగరెట్ల ముఠా అరెస్టు

HYD: కోల్‌కతా నుంచి హైదరాబాద్, కరీంనగర్‌లకు నిషేధిత ఈ-సిగరెట్లు సరఫరా అవుతున్న నెట్‌వర్క్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. కరీంనగర్‌లో ఈ నెల 12న ఓ మైనర్‌కు విక్రయించిన మహమ్మద్ ఆసిఫ్‌తో పాటు, మీర్‌చౌక్ పరిధిలో 14న రాహిల్ ఖాన్ (26)ను అరెస్టు చేశారు. మొత్తం 31 ఈ-సిగరెట్లు, ఓ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా సరఫరాదారు కోసం పోలీసులు గాలిస్తున్నారు.